
- పాల్గొనే చిన్నారులకు భోజనం, స్నాక్స్, కిట్లు అందజేత
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వేసవి సెలవుల్లో చిన్నారుల్లోని సృజనాత్మకత వెలికి తీయడంతోపాటు దైవచింతన పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘సమ్మర్ కల్చర్ క్యాంప్’ నిర్వహిస్తున్నట్టు బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి మే 17 వరకు.. ప్రతి రోజూ ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యాంప్ కొనసాగుతుందని చెప్పారు.
క్యాంప్‌లో పూజా విధానం, క్లాసికల్‌డ్యాన్స్, మంత్ర మెడిటేషన్, థియేటర్ ఆర్ట్స్, శ్లోక పఠనం, కృష్ణ పద్యాలు, ఫైర్ లెస్ కుకింగ్, వేదిక్స్టోరీస్, యోగిక్గేమ్స్వంటివి ఉంటాయన్నారు. పాల్గొనే స్టూడెంట్లకు లంచ్, స్నాక్స్, క్యాంప్కిట్అందజేస్తామని వెల్లడించారు. ఆసక్తిగా ఉన్నవారు 81436 55188కు కాల్ చేసి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. సోమవారం ఆలయంలో సమ్మర్‌క్యాంప్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.