
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం (ఫిబ్రవరి 23) బ్లాక్ బస్టర్ సమరానికి భారత్, పాకిస్థాన్ జట్లు సిద్ధమయ్యాయి. దుబాయ్ లో జరగనున్న ఈ మ్యాచ్ కు ఎప్పటిలాగే భారీ హైప్ నెలకొంది. రెండు జట్లు గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీమిండియా బలంగా కనిపిస్తున్నా పాకిస్థాన్ జట్టును తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. దుబాయ్ లో పాక్ ను ఓడించాలంటే శక్తికి మించి పోరాడాల్సిందే. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే న్యూజిలాండ్ మీద జరగబోయే చివరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి.
మరోవైపు తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓడిన పాకిస్థాన్.. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. నేడు ఇండియాతో మ్యాచ్ ఓడిపోతే ఆ జట్టు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఈ మ్యాచ్ కు సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ప్రతీకారంతో ఉంది. మ్యాచ్ కు ముందు పాక్ పేసర్ హారిస్ రౌఫ్ తమ జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ సేనతో జరిగే మ్యాచ్‌ను తమ జట్టు ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే తీసుకుంటుందని.. పోటీలో నిలిచి ఉండాలంటే విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఏ పాక్ పేసర్ చెప్పుకొచ్చాడు.
Also Read :- టీమిండియా ప్లాన్ మాకు తెలుసు
"భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాంటి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతాం. నేను 100 శాతం ఫిట్ గా ఉన్నాను. మేము ఇంతకు ముందు రెండుసార్లు దుబాయ్‌లో భారత్‌ను ఓడించాము. ఇక్కడ పరిస్థితులు మాకు బాగా తెలుసు. మా ప్లాన్ మొత్తం మ్యాచ్ రోజు పరిస్థితులు, పిచ్‌పై ఆధారపడి ఉంటుంది" అని ఈ పాక్ ఫాస్ట్ బౌలర్ తెలిపాడు.
Haris Rauf! pic.twitter.com/fn5qhqvgJX
— RVCJ Media (@RVCJ_FB) February 22, 2025