
ఎవరైనా లంచాలు అడిగితే తనకు చెప్పాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆర్డర్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన హరీశ్ రావు.. పథకాల అమలులో ఎక్కడా పైరవీలకు చోటు లేదన్నారు. గృహలక్ష్మి పథకాన్ని అర్హులంతా ఉపయోగించుకోవాలని సూచించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి గృహలక్ష్మి నిధులు జమ చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందివ్వడమే తమ లక్ష్యమన్నారు.
కళ్లముందు అభివృద్ధి కనిపిస్తుంటే ప్రతిపక్షాలు కారు కూతలు కూస్తున్నాయని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రాజెక్టులకు భూములు ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిందని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ కరువు పోయిందన్నారు.