టికెట్ల రేట్లు ఎందుకు పెంచారు? : హరీశ్ రావు

  • అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేదా?: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటించి రెండు వారాలు కూడా కాలేదని.. అప్పుడే ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. టికెట్ల రేట్లు పెంచేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా మంత్రి కోమటిరెడ్డి ప్రకటనలు నీటి మూటలయ్యాయని శుక్రవారం ట్వీట్ చేశారు.  

అసెంబ్లీలో ప్రకటనకే విలువ లేకుంటే ఎట్ల? టికెట్ల రేట్లు పెంచడంతో పాటు అదనపు షోలకు అనుమతివ్వడం సభను అవమానించడమే. సీఎం, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడ్తాం. మాట తప్పం.. మడమ తిప్పం అంటూ బీరాలు పలికి.. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు?’’అని హరీశ్ విమర్శించారు.