
ఎన్డీఎస్ ఏ ఎన్డీయే జేబుసంస్థగా మారిందనిఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ , బీజేపీ కుమ్మక్కై ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి ఉందని ఎన్డీఎస్ ఏ చెప్పలేదన్నారు హరీశ్. ఈడీ, ఐటీని వాడినట్లే దేశంలో ఎన్డీఎస్ఏ ను వాడుతున్నారని ఆరోపించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని అన్నారు. డ్యామ్ సేఫ్టీ బిల్లును పార్లమెంట్ లో కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు.
ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ పై ఉత్తమ్ మాటల్లో కొత్తదనం లేదన్నారు హరీశ్ రావు. నాలుగైదు ఏండ్లైనా పోలవరానికి ఎన్డీఎస్ ఏ ఎందుకుపోలేదని ప్రశ్నించారు. ఇక్కడ రెండు పిల్లర్లు కుంగితే ఆగమాగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు . ఎస్ఎల్ బీసీ కంటే డిజాస్టర్ ఏది ఉందన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదని హరీశ్ ప్రశ్నించారు. తుమ్మడిహట్టి నిర్మాణంపై గత కాంగ్రెస్ మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేదని ప్రశ్నించారు హరీశ్. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి ఉంటే ఈ పరిస్థతి వచ్చేది కాదన్నారు.