ముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు

ముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు

కాంగ్రెస్  సర్కార్ నిర్లక్ష్యం వల్లే  ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.   ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం రైతులకు నీళ్లు లేవన్నారు.  కాలువకు గండిపడి 20రోజులు దాటినా పూడ్చడం చేతా కాదా అని ప్రశ్నించారు. మంత్రుల సమన్వయ లోపంతో  పంటలు ఎండుతున్నాయన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని ప్రశ్నించారు.  రైతుల గోస ప్రభుత్వానికి కనిపిస్తే లేదా అని ప్రశ్నించారు.  వరదల్లో నష్టపోయిన రైతులకు రూపాయి  కూడా ఇవ్వలేదని చెప్పారు. 

తమపై దాడి చేసిన వారిపై ఇంకా కేసులు పెట్టలేదన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని..అధికారులు రెచ్చిపోవద్దన్నారు.అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అధికారులకు ఏపీలో పట్టిన గతే పడుతుందన్నారు.

  • Beta
Beta feature