పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోపాల్ పూర్ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అటు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ రెడ్డి ఉన్నారు.