దరఖాస్తుల ఆహ్వానం
నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2025–-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సంధ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6వ తరగతి ప్రవేశాలకు http://telanganams.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 2025 జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష 2025 ఏప్రిల్ 4వ తేదీన జరుగుతుందన్నారు. అలాగే 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
వెలుగు, నిజామాబాద్‌రూరల్: నిజామాబాద్శివారులోని బోర్గాం(పి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ఫెస్టివల్ఆకట్టుకుంది. శనివారం పాఠశాలలో పేరెంట్,-టీచర్మీటింగ్తో పాటు ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు చేసిన వంటకాలను ప్రదర్శించారు.సమావేశం ముగిసిన తరువాత తల్లిండ్రులు, ఉపాధ్యాయులు ఫుడ్‌స్టాల్స్‌ను సందర్శించారు. విద్యార్థులకు పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించే క్రమంలో ఫుడ్‌ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశామని హెచ్ఎం శంకర్తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
నిజాంసాగర్ (ఎల్లారెడ్డి )వెలుగు: పేకాట ఆడుతున్న వారిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామ శ్మశాన వాటికలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వారి నుంచి రూ.11540 నగదు-, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
గణిత సెమినార్లో జిల్లా టీచర్
కామారెడ్డి, వెలుగు: హైదరాబాద్‌లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌లో శనివారం నిర్వహించిన రాష్ర్ట స్థాయి సెమినార్లో కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి మ్యాథ్స్ టీచర్ తాడ్వాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. గణితంలో సృజనాత్మకత ఆలోచనలతో పాలిండ్రోమ్ నంబర్స్ అనే ఆంశంపై ప్రసంగించారు. డైరెర్టర్ రమేశ్ టీచర్ శ్రీనివాస్‌ను ప్రశంసించారు.
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి
నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సీఎం రేవంత్ రెడ్డి సి కలిసి విజ్ఞప్తి చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎంకు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని కోరారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, కొత్త రేషన్ కార్డులు, ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
యువకుడి అదృశ్యం
మహమ్మద్ నగర్ (ఎల్లారెడ్డి )వెలుగు : మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన కటికే కపిల్ (28) ఈనెల 18 నుంచి కనిపించడంలేదని నిజాంసాగర్ ఎస్ఐ శివ తెలిపారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
నవీపేట్, వెలుగు : రైతులు రెండో పంటకు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని, చెరకు పంట వేస్తే బోధన్ షుగర్ ప్యాక్టరీని ప్రారంభిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండలం లోని శాఖపూర్ కోస్లీ అల్లిసాగర్ పంపు లు స్టార్ట్ చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరికి బదులు చెరుకు పండిస్తే వచ్చే ఏడాది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని ప్రభుత్వం నడిపేందుకు సిద్ధంగాఉందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ గ్రంథాలయ చైర్మన్ అంతి రెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సహకార సభ్యుడు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ బుచ్చన్న పాల్గొన్నారు.