వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

 వరంగల్  జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

31లోగా సర్వే కంప్లీట్​ చేయాలి

హనుమకొండ, వెలుగు: డిసెంబర్ 31లోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని హనుమకొండ ఇన్​చార్జి కలెక్టర్ సత్యశారద ఆఫీసర్లను ఆదేశించారు. గ్రేటర్​వరంగల్ పరిధి 61వ డివిజన్​వడ్డేపల్లిలో సర్వే తీరును ఆదివారం ఆమె పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో 64 వేల అప్లికేషన్లు సర్వే చేయాల్సి ఉండగా 4 వేలు మాత్రమే పూర్తి కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ రవీందర్, జీడబ్ల్యూఎంసీ వార్డు ఆఫీసర్ హరినాథ్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్ తదితరులున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ములుగు, వెలుగు:  ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ నిరుద్యోగ కళాకారుల గురించి ప్రస్తావించడం సంతోషకరమని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోతె రమేశ్ కోరారు. ఆదివారం ములుగు అంబేద్కర్ విగ్రహం వద్ద మహేశ్​కుమార్ గౌడ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బత్తుల ఉపేందర్, పూలేపాక యాకయ్య, గద్దల రాజేందర్, మందపల్లి నవీన్, జేఏసీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

నేడు పీవీ వర్ధంతి

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్​పీవీ మదన్​మోహన్​ ఓ ప్రకటనలో తెలిపారు. పీవీ మ్యూజియం ఆవరణలో జరిగే కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పీవీ కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, పీవీ కుమారుడు, పీవీ గ్లోబల్​ ఫౌండేషన్​ చైర్మన్ ప్రభాకర్​ రావు పాల్గొంటారని పేర్కొన్నారు.

దుప్పి మృతి 

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శివరాం సాగర్ చెరువు సమీపంలో ఆదివారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. డిప్యూటీ రేంజర్ నరేందర్ వివరాల ప్రకారం.. మేడారం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతి వేగంగా రోడ్డు దాటుతున్న దుప్పిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డీఆర్ వో సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుప్పికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చి పెట్టారు. ఆయనవెంట ఫారెస్ట్ సిబ్బంది, డాక్టర్​ఉన్నారు.

నాటుసారా తయారీదారుల అరెస్ట్​

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: జనగామ జిల్లా ప్రొహిబిషన్​అండ్​ఎక్సైజ్​ఆఫీసర్​ అనిత ఆదేశాల మేరకు స్టేషన్​ఘన్​పూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని చిల్పూరు మండలం ఎర్రకుంటతండాలో ఆదివారం ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. అక్రమంగా నాటుసారా తయారీ, రవాణా చేస్తున్న గుగులోతు నెహ్రు, వాంకుడోతుతండాకు చెందిన వాంకుడోతు హట్టి పట్టుబడ్డారని ఎక్సైజ్​సీఐ భాస్కర్​రావు తెలిపారు. వారి వద్ద 8 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, ఆటో, బైక్​ సీజ్​చేశామన్నారు.

ఎంజేపీలో మాథమాటిక్స్ డే

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో మాథమాటిక్స్ డే సందర్భంగా విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఎంజేపీ ఐనవోలు బాలుర ప్రిన్సిపాల్ శ్రీలత మాట్లాడుతూ గణితశాస్ర్త పితామహుడు శ్రీనివాస రామానుజన్​ను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​తూర్పు నియోజకవర్గంలోని రౌడీ షీటర్లకు ఆదివారం వరంగల్​ఏసీపీ నందిరామ్​ నాయక్​ కౌన్సెలింగ్​ఇచ్చారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడవద్దని వారిని హెచ్చరించారు. 

వర్ధన్నపేట వాసికి డాక్టరేట్ 

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన చెన్న.ప్రవీణ్ కుమార్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డాక్టర్ సైదిరెడ్డి పర్నే గైడెన్స్ లో రాడార్, స్టెల్త్ అప్లికేషన్స్ లో ఉపయోగించే నానో పదార్థాలపై చేసిన పరిశోధనకు గోవా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రవీణ్ పీహెచ్​డీ పట్టా పొందారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఇంటెల్ టెక్నాలజీస్ లో ఇంజినీర్ గా 
పని చేస్తున్నారు.