![19 రాష్ట్రాలకు రూ.8,453 కోట్ల కేంద్ర నిధులు](https://static.v6velugu.com/uploads/2021/11/Health-Sector-Funds-to-19-States-from-Modi-Govt,-Telangana-didnt-send--proposals_EuBJxC8srj.jpg)
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు ఆరోగ్య విభాగం నిధుల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయిలో వైద్య పరంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచడం కోసం రూ.8,453.92 కోట్ల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు రూ.488 కోట్లను ఇచ్చింది మోడీ సర్కారు. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఈ నిధుల కోసం కనీసం ప్రతిపాదనలను పంపలేదు. అలాగే మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా ప్రపోజల్స్ పంపకపోవడంతో నిధులు విడుదల కాలేదు. ఈ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందితే.. ఆ తర్వాత నిధులు విడుదల చేయస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు.