హైదరాబాద్: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం వరకు వేడెక్కిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట,కూకట్ పల్లి, నిజాంపేట, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్,నాంపల్లి, అబిడ్స్, బాచుపల్లి, లో వర్షం కురుస్తోంది. గాలి దుమారం రావడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గుతుంది. సాయంత్రం సమయం కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంపై GHMC అలెర్టయ్యింది. గ్రౌండ్ లెవెల్ లో పని చేస్తున్న సిబ్బంది, అధికారులు అలెర్ట్ గా ఉండాలని GHMC కమిషనర్ ఆదేశించారు.
అటు తెలుగురాష్ట్రాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. వికారాబాద్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. అకాల వర్షంతో పలుచోట్ల పంటనష్టం జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్టంపైన ఉపరితల అవర్తనం కోనసాగుతుందని తెలిపిన వాతావరణశాఖ..రాగల మూడు రోజులు కూడా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.