భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో జనజీవనం స్తంభించింది. ప్రధానంగా గోదావరి నది ఉధృతి భారీగా పెరిగింది. జల ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. పలుచోట్ల వరదనీటి కారణంగా పంట నష్టం కూడా వాటిల్లింది. ఇంకొన్ని చోట్ల రోడ్లపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.