తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు మూడ్రోజులపాటు, మిగిలిన జిల్లాలకు శనివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.