నాలుగు రోజుల్లో 4.24 లక్షల వెహికల్స్‌‌

  • పంతంగి, గూడురు టోల్‌‌ప్లాజా గుండా రాకపోకలు

యాదాద్రి​, వెలుగు : సంక్రాంతి పండుగకు తోడు వీకెండ్‌‌ కూడా కలిసి రావడంతో ప్రజలు శుక్రవారం రాత్రి నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. దీంతో అటు విజయవాడ, ఇటు వరంగల్‌‌ హైవేలపై వాహనాల రాకపోకలు భారీ సంఖ్యలో పెరిగాయి. పంతంగి, గూడూరు టోల్‌‌గేట్ల మీదుగా శుక్రవారం నుంచి సోమవారం రాత్రి వరకు 4.24 లక్షల వెహికల్స్‌‌ రాకపోకలు సాగించాయి. హైదరాబాద్‌‌ – విజయవాడ హైవేపై నాలుగు రోజుల్లో 2.70 లక్షల వెహికల్స్‌‌ రాకపోకలు సాగగా, ఇందులో 1.85 లక్షల వాహనాలు విజయవాడ వైపు వెళ్లాయి.

 మరో 85 వేల వెహికల్స్‌‌ హైదరాబాద్‌‌ వైపు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌‌ – -వరంగల్‌‌ హైవేపై 1.54 లక్షల వెహికల్స్‌‌ తిరగగా, వరంగల్‌‌ వైపు 90 వేలు, హైదరాబాద్‌‌ వైపు 64 వేల వెహికల్స్‌‌ వెళ్లాయని గూడూరు టోల్‌‌ప్లాజా సిబ్బంది తెలిపారు. సోమవారం పండుగ కావడంతో హైవేలపై రద్దీ తగ్గింది. సోమవారం ఒక్కరోజు విజయవాడ హైవేపై 40 వేల వెహికల్స్‌‌ రాకపోకలు సాగగా, వరంగల్‌‌ హైవేపై 27 వేల వెహికల్స్‌‌ నడిచాయి.