ఇది తెలుగు సినిమా గెలవాల్సిన టైమ్

దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా పరిచ యమవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌‌. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ మూవీలోని ‘డేట్ నైట్‌‌’ సాంగ్‌‌ని నిన్న అల్లు అర్జున్ లాంచ్‌‌ చేశాడు. అనంతరం మాట్లాడుతూ ‘నాతో ‘ఆర్య’ సినిమా తీసిన దిల్‌‌రాజు గారికి నా కెరీర్‌‌‌‌లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అందుకే నాకిది ఫ్యామిలీ ఈవెంట్‌‌ లాంటిది. నేనేం ఫేవర్ చేయట్లేదు.. ఇది నా బాధ్యత. సాంగ్ చాలా బాగుంది. ఆశిష్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు. టీమ్‌కి నా బెస్ట్ విషెస్. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలకీ ఆల్‌‌ ద బెస్ట్. ఈ సినిమా, ఆ సినిమా అని కాకుండా ప్రతి తెలుగు సినిమా గెలవాల్సిన టైమ్ ఇది’ అన్నాడు.  డైరెక్టర్ హర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘నా ఫస్ట్ మూవీ ‘హుషారు’కి బన్నీ ఎంతో సపోర్ట్ చేశారు. మళ్లీ ఇప్పుడీ పాటను లాంచ్ చేశారు. ఆయనకి థ్యాంక్స్. కాలేజీల్లో రెగ్యులర్ ఫ్రెషర్స్ పార్టీలను బ్రేక్ చేసి కొత్తగా ట్రై చేద్దామని డేట్ నైట్ కాన్సెప్ట్‌‌తో ఈ పాట తీశాం’ అని చెప్పాడు. 

దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సంక్రాంతికి మా బ్యానర్‌‌‌‌ నుంచి వస్తున్న యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్ ఇది. నా సినిమాలన్నీ పద్ధతిగా, ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటాయి. ఈ సినిమా కోసం కొంచెం బోర్డర్ దాటాం. ఇప్పటి వరకు సంక్రాంతికొచ్చిన మా ఐదు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమాతో సెకెండ్ హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం ఉంది’ అన్నారు. బన్నీని చూసి చాలా నేర్చుకున్నానని, తమ సినిమా అలరిస్తుందని  ఆశిష్ చెప్పాడు. శిరీష్ కూడా పాల్గొన్నారు.