- నల్గొండ లేదా భువనగిరి నుంచి...
- శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : హైకమాండ్ ఆదేశిస్తే తన కొడుకు అమిత్ రెడ్డి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తాడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ లేదంటే భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీలో ఉంటాడన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం కనిపించిందని, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదన్నారు.