ఏఐతో న్యాయసేవల్లో విప్లవాత్మక మార్పులు  : హైకోర్టు జడ్జి సూరెపల్లి నంద 

ఏఐతో న్యాయసేవల్లో విప్లవాత్మక మార్పులు  : హైకోర్టు జడ్జి సూరెపల్లి నంద 

 స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ఆర్టిఫియల్​ ఇంటలిజెన్సీ(ఏఐ)తో న్యాయసేవల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జనగామ అడ్మినిస్ట్రేటివ్​జడ్జి సూరెపల్లి నంద తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​మున్సిపాల్టీలోని పాత ఎస్సీ హాస్టల్​ బిల్డింగ్​లో కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్​ సివిల్​జడ్జి, ఫస్ట్​ క్లాస్​కోర్టును శనివారం సాయంత్రం ఆమె ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన న్యాయసేవలతోపాటు వేగంగా పరిష్కరిస్తామన్నారు. సంవత్సరాలుగా పెండింగ్​లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తామన్నారు. జనగామ కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ మాట్లాడుతూ స్టేషన్​ఘన్​పూర్​మున్సిపాల్టీ ఏర్పడిన కొద్ది రోజులల్లోనే ఇక్కడ కోర్టు ప్రారంభించడంతో ప్రజలకు సత్వరంగా న్యాయ సేవలు అందుతాయన్నారు.

అనంతరం హైకోర్టు జడ్జి సూరెపల్లి నందను జనగామ, స్టేషన్​ఘన్​పూర్​బార్​అసోసియేషన్​సభ్యులు గజమాలతో సన్మానించారు. అడిషనల్​కలెక్టర్ పింకేశ్​కుమార్, జిల్లా పర్సనల్​సెషన్స్​జడ్జి రవీంద్రశర్మ, డీసీపీ రాజమహేంద్రనాయక్, జనగామ బార్​అసోసియేషన్​ప్రెసిడెంట్​చంద్రరుషి, స్టేషన్​ఘన్​పూర్​బార్​అసోసియేషన్​సభ్యులు కనకం రమేశ్, గుర్రపు బాబురావు, గద్దె అనిల్, పోగుల కార్తీక్, గట్టు రవి పాల్గొన్నారు.