హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ మేకల తిరుపతన్నను మార్చిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారించారు.