
- జీవన్‌రెడ్డికి తేల్చిచెప్పిన హైకోర్టు
హైదరాబాద్,వెలుగు: భూవివాదంపై నమోదైన కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దర్యాప్తును ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు బుధవారం తేల్చి చెప్పింది. భూవివాదానికి సంబంధించి చేవెళ్ల, మోకిలా పోలీసు స్టేషన్‌లలో గతేడాది నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వీటిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ పిటిషన్‌లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమికి సంబధించిన వివాదంలో తమ భూమిని ఆక్రమించారని, తాను నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారని, ప్రశ్నిస్తే ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ సామా దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.