చండ్రుగొండ, వెలుగు : లాభాలు అధికంగా వచ్చే మునగ సాగుపై రైతులు దృష్టి సారించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. మంగళవారం అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు చెందిన రైతులకు మునగ సాగుపై స్థానిక రైతువేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మునగ సాగుకు ఉపాధి హామి పథకంలో వందశాతం సబ్సిడీ వస్తుందని, ఎకరానికి రూ.1.20 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. మునగ సాగు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉందని, ప్రతీ రైతు మునగ సాగును చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ విద్యాలత, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్, ఏవో వినయ్, ఏపీఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.