హైదరాబాద్ సిటీలో ఎండ మండిపోతున్న ప్రాంతాలు ఇవే.

హైదరాబాద్ సిటీలో ఎండ మండిపోతున్న ప్రాంతాలు ఇవే.

హైదరాబాద్ లో భిన్న వాతావరణ కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండలు..ఉదయం చలి పెడుతోంది.  చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతున్నాయి.   నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. హిమాయత్‌నగర్‌, అంబర్‌పేటలో అత్యధికంగా 23.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని  ఇతర ప్రాంతాలలో కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.

హైదరాబాద్ లో  గత 30 ఏళ్లుగా  ఈ స్థాయిలో  ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.  వర్షాకాలం ఉన్నప్పటికీ వర్షాలు పడే అవకాశం  కనిపించడం లేదు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో నగరంలో వర్షాలు పడటం లేదు. 

హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 20-22 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది. అలాగే రాబోయే కొన్ని రోజులు హైదరాబాద్ లో చలికాలంలోనూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 

 

  • హిమాయత్ నగర్ లో 331 డిగ్రీల ఉష్ణోగ్రత
  • బహదూర్ పుర 33.1 డిగ్రీలు
  •  నాంపల్లి : 33.2 డిగ్రీలు
  •  ఖైరతాబాద్ 33.3 డిగ్రీలు
  •  అసిఫానగర్ : 33.5 డిగ్రీలు
  • అంబ్ పేట : 33.6 డిగ్రీలు
  •  మొండమార్కెట్ 34.5 డిగ్రీలు
  • షేక్ పేట 35 డిగ్రీలు
  • మారేడ్ పల్లి : 35 డిగ్రీలు