ఇవ్వాళ సెట్ కన్వీనర్ల సమావేశం

ఇవ్వాళ  సెట్ కన్వీనర్ల సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే ప్రవేశపరీక్షల కన్వీనర్లతో మంగళవారం హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్ బాలకిష్టారెడ్డి సమావేశం కానున్నారు. వివిధ కోర్సుల్లో నిర్వహించే ఎంట్రెన్స్  పరీక్షల నిర్వహణపై వారితో చర్చించనున్నారు.

క్వశ్చన్  పేపర్ల తయారీ, సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై మాట్లాడనున్నారు. ఏప్రిల్  నెలాఖరు నుంచే ప్రవేశపరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఇప్పటికే ఎంట్రెన్స్  ఎగ్జామ్స్  షెడ్యూల్​ను కౌన్సిల్ అధికారులు తయారుచేసి సీఎం  ఆమోదం కోసం పంపించారు. త్వరలోనే వాటికి ఆమోదం లభించనున్నది.