
- అభ్యంతరాలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిసర్చ్
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో చేపట్టే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21లో మార్పులు వచ్చే అవకాశం కన్పిస్తోంది. రిక్రూట్మెంట్లో యూజీసీ నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే పలువురు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులకు విజ్ఞప్తులు చేశారు. వర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ లెక్చరర్లు తమకూ వెయిటేజీ వర్తింపజేయాలని కోరుతున్నారు. మరోపక్క కాంట్రాక్టు లెక్చరర్లు తమకు ప్రత్యేకంగా వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు.
దీనికితోడు యూజీసీ నిబంధనల ప్రకారం పీహెచ్డీ ఉంటే 30 మార్కులు ఇవ్వాల్సి ఉందని.. కానీ, ప్రస్తుత జీవోలో 10 మార్కులే ఇచ్చారని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికితోడు రిక్రూట్మెంట్ లో నెట్ లేదా పీహెచ్డీ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కూడా అమలు చేయాలని మరికొందరు అభ్యర్థులు కౌన్సిల్ అధికారులను కోరారు. బీటెక్ కోర్సులో వచ్చే మార్కులకు వెయిటేజీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను తీసుకొని.. వాటిపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు స్టడీ చేస్తున్నారు.