నాగ్‌పూర్: విదర్భతో రంజీ ట్రోఫీ సెమీస్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. హిమాన్షు మంత్రి (126) సెంచరీ చేయడంతో 47/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్ 94.3 ఓవర్లలో 252 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో ఎంపీ జట్టుకు 82 పరుగుల ఆధిక్యం దక్కింది. సారాన్షు జైన్ (30), సాగర్ సోలంకీ (26), హర్ష్ గ్వాలీ (25) ఫర్వాలేదనపించారు.
ఉమేశ్ యాదవ్ (3/40), యష్ ఠాకూర్ (3/51), అక్షయ్ (2/68) బౌలింగ్ ధాటికి ఎంపీ ఇన్నింగ్స్‌లో శుభమ్ శర్మ (1), వెంకటేశ్ అయ్యర్ (0), అనుభవ్ (6), కుమార్ కార్తికేయ (8), అవేశ్ ఖాన్ (7 నాటౌట్), కుల్వంత్ (4) ఫెయిలయ్యారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విదర్భ ఆట ముగిసే టైమ్‌కు 4 ఓవర్లలో 13/1 స్కోరు చేసింది.
ధ్రువ్ షోరె (10 బ్యాటింగ్), అక్షయ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉండగా, అథర్వ థైడ్ (2) విఫలమయ్యాడు. విదర్భ ఇంకా 69 రన్స్ వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 170 రన్స్ మాత్రమే చేసింది.