నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ : ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకుడు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కాశ్మీర్‌లో ప్రారంభమైంది. నాని రౌడీలను ఎదుర్కొంటున్న యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం అక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో చూపించినట్టుగా హిట్ ఆఫీసర్‌గా మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నాని నటిస్తున్నాడు. తనకు జంటగా శ్రీనిధి శెట్టి కనిపించబోతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 1న సినిమా విడుదల కానుంది.