7 సిటీల్లో ఇండ్ల అమ్మకాలు తగ్గే చాన్స్​ : ప్రాప్​ఈక్విటీ

7 సిటీల్లో ఇండ్ల అమ్మకాలు తగ్గే చాన్స్​ : ప్రాప్​ఈక్విటీ

న్యూఢిల్లీ: ఇండ్ల విక్రయాలు జులై–-సెప్టెంబర్ క్వార్టర్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో 18 శాతం క్షీణించి 1,04,393 యూనిట్లకు పడొచ్చని అంచనా. రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ ప్రాప్​ఈక్విటీ డేటా ఈ నగరాల్లో ఇండ్ల విక్రయాల డేటాను విడుదల చేసింది.  గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,26,848 యూనిట్లుగా ఉన్నాయి.  డేటా ప్రకారం, ఈ ఏడాది జులై–-సెప్టెంబర్ కాలంలో ఇండ్ల విక్రయాలు ఢిల్లీ-–ఎన్‌‌సీఆర్ (22 శాతం), నవీ ముంబై (4 శాతం)లో మాత్రమే పెరుగుతాయని అంచనా.  

హైదరాబాద్‌‌లో అత్యధికంగా 42 శాతం, బెంగళూరు (26 శాతం), కోల్‌‌కతా (23 శాతం), పుణె (19 శాతం), చెన్నై (18 శాతం), ముంబై (17 శాతం), థానే (10 శాతం)లో విక్రయాలు తగ్గే అవకాశం ఉంది. ఈ క్వార్టర్లో కూడా కొత్త లాంచ్‌‌ల కంటే అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్‌‌కు డిమాండ్ బలంగా కొనసాగుతోందని ప్రాప్​ఈక్విటీ ఫౌండర్​ సమీర్ జసుజా చెప్పారు.    హైదరాబాద్‌‌లో నివాస ఇండ్ల విక్రయాలు 20,658 యూనిట్ల నుంచి 42 శాతం క్షీణించి 12,082 యూనిట్లకు చేరుకోవచ్చని అన్నారు.