హిందువులు పవిత్రంగా భావించే పుణ్య దినాల్లో ఒకటి రథసప్తమి. ప్రతి పుణ్యదినం మాదిరిగానే రథ సప్తమి రోజు కూడా నదుల్లో పుణ్య స్నానం ఆచరిస్తారు. రథ సప్తమి రోజే సూర్యభగవానుడు జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ధృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4 వ తేది వచ్చింది. అయితే ఈ రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. జిల్లేడు ఆకులకు.. రథ సప్తమికి సంబంధం ఏమిటి.. ఆరోజున తలపై జిల్లేడు ఆకులను పెట్టి ఎందుకు స్నానం చేయాలి.. పురాణాల్లో ఏముంది .. పండితులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
రథసప్తమి రోజున ( ఫిబ్రవరి 4) సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి... సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం.. అంటూ. సూర్యుడిని స్తుతిస్తూ జిల్లేడాకులు వేసిన నీటితో స్నానం చేయాలి. స్నానం మధ్యలో తల మీద ఏడు జిల్లేడాకులు, రేగిపండు పెట్టుకోవాలి. జిల్లేడుకు సంస్కృతంలో అర్క అని పేరు. సూర్యుడి సహస్ర నామాల్లో అర్క ఒకటి అలాగే రేగుపండు సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది అందుకే రథసప్తమి రోజు ఈ రెండు తలపై పెట్టుకుని స్నానం చేసి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యం లభించడంతో వివిధ రకాల వ్యాధులు నశిస్తాయని చెబుతారు.
ALSO READ : రథ సప్తమి రోజు (ఫిబ్రవరి 4) ఎలా స్నానం చేయాలి.. సూర్య భగవానుడిని ఎలా పూజించాలి..
రథసప్తమి నాడు ఎందుకు జిల్లేడు ఆకులు, రేగు పండ్లను శిరస్సుపై పెట్టి స్నానం చేయడం వలన ఎంతో విశిష్ట ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడుని ఆరాధించడం వలన తేజస్సు, ఐశ్వర్యం కలుగుతాయి. సూర్యోదయానికి ముందు నిద్రలేచి నదీ స్నానం చేయడం వలన సప్త జన్మల పాపాలు తొలగిపోతాయి. శోకము, రోగము వంటి బాధల నుంచి బయటపడవచ్చని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. .
పురాణ కథ
పూర్వ కాలంలో రథసప్తమి రోజున అగ్నిష్వాత్తులు అనే పండితుడు.. తనువు చాలించిన తరువాత స్వర్గలోకానికి వెళ్లేందుకు ఎంతో నిష్టగా యజ్ఞం చేస్తున్నారు . దీనికి పరమేశ్వరుడు.. విష్ణుమైర్తి తృప్తి స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపారు. అయితే దేవ విమానం వచ్చిన సమయంలో .. ఆ పండితులు యఙ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి చేస్తున్నారు. ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని అగ్నిలో వేస్తుండగా.. దేవ విమానాన్ని చూసిన ఆ ముని.. ఆ క్రతువుని కంగారుగా చేసేసారని పురాణాలు చెబుతున్నాయి.
పూర్వ కాలంలో యఙ్ఞాలు విశాలమైన ప్రదేశంలో చేసేవారు. కంగారుగా పూర్ణాహుతి చేసే సమయంలో అటుగా మేక వెళుతుంది. ఆ సమయంలో గాలి దుమారం రావడంతో అగ్నిలో వేస్తున్న వేడిగా ఉన్న ఆవు నెయ్యి అటుగా ఆ మేకపై పడి.. చర్మం ఊడి..చనిపోయింది. ఆ చర్మం పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడటం.. ఆ మేక పిల్ల ఆత్మవెళ్లి దేవ విమానంలో కూర్చుంది. మేక చర్మం జిల్లేడు చెట్టుపై పడడంతో ఆకులు కూడా మేక చర్మంలా మారాయి.
ALSO READ : రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
దీనితో అగ్నిష్వాత్తులు బాధ పడ్డారు. అప్పుడు ఆన యజ్ఞఫలం మేకకి, జిల్లేడు చెట్టుకి దక్కిందని ఆకాశవాణి చెప్పింది. ఆ రోజు మాఘశుద్ధ సప్తమి అందుకే ఈ రోజున జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని.. అలా చేసిన వారికి కూడా యజ్ఞఫలం వస్తుందని దేవతలు వరం ఇచ్చారు. అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు.
జిల్లేడు ఆకులను తలపై ఉంచుకొని స్నానం చేయడం అనేది ఆధ్మాత్మికంగానే కాకుండా సైంటిఫిక్ కూడా చాలా మంచిదని సైంటిస్టులు చెబుతున్నారు.
జిల్లేడు ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం వలన ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా .. శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని గ్రహిస్తుంది. జిల్లేడు ఆకుల్లో ఉండే రసాయనాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా జిల్లేడు ఆకుల్లో ఉంటాయి.వాపు, నొప్పి వంటి సమస్యల్ని కూడా జిల్లేడు ఆకు తొలగిస్తుంది.