మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? దీర్ఘకాలం పొదుపు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ పెట్టుబడి ఎలా ప్లాన్ చేయాలనుకుంటున్నారా? మీకు 20ఏళ్లు పైబడ్డాయా? మరో 10ఏళ్లల్లో ధనికులు అవ్వాలని కలలు కంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.
ధనం మూలం ఇదం జగత్.. ఈ మాటను చాలా మంది సీరియస్‌గా తీసుకుంటారు. కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటారు. ముఖ్యంగా యువతలో ఈ ఆశలు ఎక్కువగా ఉంటాయి. రిస్క్ తీసుకునే యేజ్ కూడా వారికి ఉంది కాబట్టి.. కలలను వారు నెరవేర్చుకునే అవకాశాల ఎక్కువగా ఉంటాయి. మీరు 20ఏళ్లు పైబడి.. కోటీశ్వరులు అవ్వాలని ఆశిస్తున్నారా? 20ఏళ్లకు ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టి.. మీకు 30ఏళ్లు వచ్చేసరికి కోటీశ్వరులు అయ్యే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టే భారతీయులు, రిస్క్ ఉంటుందనే ఆలోచనతో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఈ ఆలోచనా ధోరణి మారింది. టెక్నాలజీ సామాన్యులకు సైతం పెట్టుబడి మార్గాలను పరిచయం చేస్తున్న తరుణంలో యువత, మిలీనియల్‌తో పాటు ఇతరులు సైతం ఎంతో కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds), సంబంధిత లో రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు.ఈ నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే వారి కోసం, దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఇచ్చే పెట్టుబడి మార్గాలు, వీ ‘లైవ్‌మింట్’కు వివరించారు గ్రిప్ వ్యవస్థాపకుడు & CEO నిఖిల్ అగర్వాల్.
మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టేముందు, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవగాహన లేకుండా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆర్థిక నష్టాలకు గురికాక తప్పదు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ప్రారంభించడానికి ముందే రిసెర్చ్ చేయాలి. ఇందులో ఎదురయ్యే చిక్కులను, నష్టాలను తగ్గించడానికి, రాబడి అవకాశాలను పెంచడానికి మార్గాలను తెలుసుకోవాలి. అవసరమైతే ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్స్ సలహాలు తీసుకోవాలి. పెట్టుబడి, నష్టభయం (రిస్క్) ఒకేచోట ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే, రాబడి శాతం అంత ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా రిస్క్‌కు లోబడి ఉంటాయి. అందుకే మీరు ముందు రిస్క్ టాలరెన్స్‌ను అర్థం చేసుకోవాలి.
ALSO READ :బంపర్ ఆఫర్..రూ. 15 వేల బ్రాండెడ్ ఫోన్..కేవలం రూ. 9500 కే
ఎక్కువ నష్టభయం ఉండే పెట్టుబడులు అధిక రాబడిని ఇవ్వగలిగినప్పటికీ, ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ పెట్టుబడి లక్ష్యాలను, రిస్క్‌కు రిలేట్ చేయండి. అవసరం లేదనుకుంటే రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మార్కెట్ అస్థిరత, మారుతున్న ట్రెండ్స్ అనిశ్చితికి దారితీయవచ్చు. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుకోవాలనే లక్ష్యంతో ముందడుగు వేయాలి.
మనకు అందుబాటులో అనేక పెట్టుబడి మార్గాలు ఉంటాయి. అయితే ఇన్వెస్టర్ ఏదో ఒక మార్గంలోనే మొత్తం నిధులను పెట్టుబడి పెడితే, మార్కెట్ అస్థితర పరిస్థితుల్లో పూర్తిగా నష్టపోవచ్చు. అందుకే రిస్క్‌ను డైవర్సిఫికేషన్ చేయాలి. అంటే మీ నిధులను వేర్వేరు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. కొంత మొత్తం కార్పొరేట్ బాండ్స్, సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, స్టార్టప్ ఈక్విటీ, CRE వంటి అసెట్ క్లాసెస్‌లో పెట్టుబడులను విస్తరించాలి. ఫలితంగా రిస్క్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ నష్టాలను మిగిల్చినా, పోర్ట్‌ఫోలియోలోని ఇతర పెట్టుబడులు మీకు రాబడిని అందిస్తాయి.
మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడులు ఇన్వెస్టర్లకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ స్ట్రాటజీలో మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఏర్పడే స్వల్పకాలిక నష్టాలు ఇన్వెస్టర్ రాబడిని ప్రభావితం చేయలేవు. దీంతో లాంగ్ టర్మ్‌లో నిర్ణీత రాబడి కచ్చితంగా అందుతుంది.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్
25ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి సిప్‌లు స్టార్ట్ చేయాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ని 'సిప్' అంటారు. ఆ వయస్సుకి వారికి ఉద్యోగాలు వస్తాయి కదా. ఆలస్యం చేయకూడదు. తక్కువ వయస్సులో సిప్‌ను మొదలుపెట్టి.. నిలకడగా దానిని ముందుకు తీసుకెళితే.. అద్భుతాలను సృష్టిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు,దేశంలో ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.