WAR 2: వార్ 2 నుండి క్రేజీ న్యూస్.. హృతిక్తో తారక్ దండయాత్ర మొదలు!

WAR 2: వార్ 2 నుండి క్రేజీ న్యూస్.. హృతిక్తో తారక్ దండయాత్ర మొదలు!

ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్(Ntr) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న సినిమాలపై ఇంటర్నేషనల్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి  దేవర2 కాగా రెండవది బాలీవుడ్ లో చేస్తున్న వార్2 (War2), మూడవది ప్రశాంత్ నీల్ తో NTR 31. దేవర 2 వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పై వెళ్లనుందని టాక్.

ఇక ఉన్న ఈ రెండు సినిమాల్లో వార్ 2 మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. కారణం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)  హీరోగా నటిస్తుండటం. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వార్ 2 గురించి అలాంటి న్యూస్ ఒకటితో ఫిల్మ్ వర్గాల్లో చర్చనియ్యాంశం అయింది.

అదేంటంటే..  ప్రస్తుతం వార్ -2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ లేని సీన్స్ ను మేకర్స్ పర్సెంట్ షూట్ చేస్తుండగా.. అక్టోబర్ 2వ వారంలో వార్ – 2 షూట్ లో పాల్గొనబోతున్నాడని సమాచారం. అంతేకాకుండా నవంబర్ ఫస్ట్ వీక్ లో క్లైమాక్స్ పోర్షన్ ఫైట్ సీన్ 20 రోజుల పాటు చిత్రీకరించబడుతుందిని తెలుస్తోంది.

ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్.. 'హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ క్లైమాక్స్ బ్లాక్‌ని డిజైన్ చేయడానికి YRFలో ప్రీ-ప్రొడక్షన్ పురోగతిలో ఉంది. క్లైమాక్స్‌లో కొంత భాగం ముంబైలో షూట్ చేయబోతుంది' అని మేకర్స్ తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇన్నాళ్లు 'దేవర కోసం ఆయుధపూజా చేసిన తారక్ అన్న.. త్వరలో యుద్ధంలో దిగి దండయాత్ర షురూ చేయనున్నాడు' అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.