సిద్దార్ధ్ ఆనంద్(Siddharth Anand) డైరెక్షన్ లో హృతిక్ రోషన్(Hruthik Roshan), దీపికా పదుకొనే( Deepika Padukone) కాంబో లో వస్తోన్న మూవీ ఫైటర్(Fighter). ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ వచ్చే సంవత్సరం 2024 జనవరి 25 న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌లో హృతిక్, దీపిక పదుకునే, అనిల్ కపూర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్‌గా నటిస్తున్నారని ఇంట్రడ్యూస్ చేశారు.
స్పిరిట్ అఫ్ ఫైటర్.. వందేమాతరం..సుజలం,సుఫలం, మలయజ శీతలం..భారతదేశ గర్జనను వినడానికి రెడీగా ఉండండి అంటూ ఆడియన్స్ కు అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సిద్దార్ధ్.
ALSO READ :ఆమె నిజంగా ఆది ప్రేయసేనా? వైరలవుతున్న లేటెస్ట్ ప్రోమో
షారుఖ్ పఠాన్, హృతిక్ వార్ మూవీస్ ను డైరెక్ట్ చేశారు సిద్దార్ద్ ఆనంద్. ఇప్పడు దేశభక్తి నేపధ్యం లో వస్తోన్న ఫైటర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ మూవీలో హృతిక్ రోషన్ పాటీ అనే IAF ఆఫీసర్ పాత్రను పోషించాడు. పైలట్ జి-సూట్‌లో కనిపిస్తోన్న హృతిక్ ఆకట్టుకుంటున్నారు. అలాగే హృతిక్ ట్విట్టర్లో వీడియో షేర్ చేస్తూ 'స్పిరిట్ ఆఫ్ ఫైటర్'.. వందేమాతరం.. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలో కలుద్దాం. ఫైటర్ 25 జనవరి 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.' అని ట్వీట్ చేశారు.
డైరెక్టర్ సిద్ధార్ద్.. హీరో హృతిక్ రోషన్ కాంబోలో ఇది మూడవ చిత్రం గా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి నుండి వచ్చినబ్యాంగ్ బ్యాంగ్, వార్ బాక్సాపీస్ వద్ద పెద్ద సక్సెస్ అయ్యాయి.ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినాట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని వయాకామ్ 18 నిర్మిస్తోంది. 2024 జనవరి 25న వరల్డ్ వైడ్ గా రీలిజ్ కానుంది.
#SpiritOfFighter | Vande Mataram! ??
— Hrithik Roshan (@iHrithik) August 15, 2023
See you in the theaters on the eve of India’s 75th Republic Day. Fighter releases worldwide on 25th January 2024. pic.twitter.com/23fvysWgsV