ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఈ నెల 18న జరగనుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు మెస్రం వంశస్థులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తరలివస్తున్నారు.
నాగోబా ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.
బాసరకు పోటెత్తిన భక్తులు
నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శుక్రవారం శుభదినంగా భావిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, ఒడిబియ్యాన్ని సమర్పించుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం పూజలు చేయిస్తున్నారు.