వరంగల్ మార్కెట్ లో మిర్చికి భారీ ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి భారీ ధర పలికింది. దేశి మిర్చి ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడుపోయింది. క్వింటాల్ ఎర్రబంగారం ధర 48 వేలుగా నమోదైంది. ఇప్పటి వరకు దేశిరకం మిర్చికి ఇదే అత్యధిక ధరని చెప్పారు అధికారులు. ఈ ఏడాది మిర్చికి తెగుళ్లు రావటంతో తక్కువగా దిగుబడి వచ్చింది. దీంతో మిర్చికి అధిక రేటు వస్తుందంటున్నారు అధికారులు. అయితే రికార్డ్  స్థాయిలో ధర పలకడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్కెట్ లో కొద్ది రోజుల క్రితం క్వింటాల్ సింగిల్ పట్టి రకం మిర్చిని 45 కొనుగోలు చేశారు వ్యాపారులు. ఎనుమాముల మార్కెట్ చరిత్రలో క్వింటాల్ మిర్చికి 48 వేలు పలకడం ఆల్ టైం రికార్డు అని తెలిపారు అధికారులు.

For more news..

కేసీఆర్ దోపిడీకి కేంద్రం సహకరిస్తోంది

బంగ్లాపై భారత్ ఘన విజయం