హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ లో సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖలో నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకమైందని.. ఒక ప్రత్యేక వ్యవస్థగా పనిచేయాలని ఆయన అన్నారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ సూచించారు. సమాచారం సేకరించి ఇవ్వడం వల్ల ఉన్నతస్థాయి అధికారులకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ పోలీసులకి మంచి సపోర్ట్ గా పని చేయాలని ఆదేశించారు.
ALSO READ | కేసీఆర్ కొడుకు సుద్దపూస లెక్క వ్యవహరిస్తుండు.. బండి సంజయ్ ఫైర్..
స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది అధికారులు తమకు వచ్చిన సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కోరారు. ఇక్కడ పనిచేసేంతకాలం అంకితభావంతో పని చేయాలని.. ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా హైయర్ ఆఫీసర్స్ కు షేర్ చేయాలని అన్నారు. బయటనుంచి కొత్తగా వచ్చిన వారిపై నిఘూ ఉంచాలి. ఎక్కడైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించినా.. హోటల్, బస్తీ, కాలనీ వాసుల నుండి సమాచారం వచ్చేలాగా సోర్స్ ని క్రియేట్ చేసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి సిటీ పోలీస్ బాస్ చెప్పారు. సరిహద్దు దేశాల నుంచి హైదరాబాద్ కి పనుల నిమిత్తం వచ్చే వారిపైన నిరంతరం నిఘా ఉంచాలని అన్నారు ఆయన. ప్రజలతో మమేకమై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సమాచారాన్ని సేకరించే విధంగా పనిచేయాలని సీవీ ఆనంద్ సూచించారు.