హైదరాబాద్​ ఎకో టౌన్ ఏర్పాటుకు రంగం సిద్దం..జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం

హైదరాబాద్​ ఎకో టౌన్  ఏర్పాటుకు రంగం సిద్దం..జపాన్ సంస్థలతో తెలంగాణ రైజింగ్ బృందం ఒప్పందం
  • కిటాక్యూషులోని మురాసాకి నది పునరుజ్జీవన ప్రాజెక్టు సందర్శన 
  • సుస్థిరత ఆప్షన్​ కాదు.. అవసరమన్న సీఎం రేవంత్ రెడ్డి
  •  పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య 

హైదరాబాద్. వెలుగు: హైదరాబాద్​ లో  ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఆదివారం జపాన్​ లోని కిటాక్యూషునగరా న్ని సందర్శించింది. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్​ ను  శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దేందుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థలు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో సహకారం అందించనున్నాయి. ఈ మేరకు బెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ ఓఐ)పై సంతకాలు చేశారు. 

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నం: సీఎం 

సుస్థిరత ఇకపై ఆప్షన్ కాదని, అవసరం అని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధి చేస్తే భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణా న్ని అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందాల సందర్భంగా సీఎం రేసంత్ రెడ్డి మాట్లాడారు. జపనీస్ భాషలో నైపుణ్యం సాధిస్తే తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు పెరుగు తాయని పేర్కొన్నారు. 

కిటక్యూషుకు బుల్లెట్ ట్రైన్​ లో..  

తెలంగాణ రైజింగ్ బృందం జపాన్లోని ఒసిస్–-ఒసాకా నుంచి కిటక్యూషు నగరానికి బుల్లెట్ ట్రైన్లో లో ప్రయాణించింది. ఈ సందర్భంగా మేయర్ కజూహిసా టేకుచి.. కోకురా కాసిల్ వద్ద సంప్ర దాయ సమురాయ్ ఖడ్గ యోధులు, టైకో డ్రమ్ బీట్స్​ తో  రాష్ట్ర బృందానికి స్వాగతం పలికారు.

కిటాక్యూషూ కాలుష్య నగరం నుంచి పర్యావరణ సురక్షితంగా మారిన విధానాన్ని మేయర్ వివరించారు. అదే విధంగా కిటాక్యూషులోని మురాసాకి నదీ పునరుజ్జీవన ప్రాజె క్టును సందర్శించి, కాలుష్యకాసారం నుంచి పరిశుభ్ర నదీతీరంగా మారిన విధానాన్ని సీఎం రేవంత్ టీమ్ స్టడీ చేసింది. మేయర్ కజూహిసా టేకుచితో పరిశుభ్ర నగర మోడల్స్, నదుల పునరుజ్జీవనం, సాంకేతిక ఆవిష్కరణలపై చర్చించారు. కిటా క్యూషూ ఒకప్పుడు కాలుష్యంతో ఇబ్బందులు పడిన నగరమని.. ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్ర నగరాల్లో ఒకటిగా మారిందని మేయర్ టేకుచి తెలిపారు. ఆ అనుభవాలను తెలంగాణతోపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తెలంగాణలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రమశక్తి. పారదర్శక పాలన వంటివి జపాన్ పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తు న్నాయని తెలిపారు. హైదరాబాద్ కిటాక్యూషు మధ్య విమాన సర్వీసు, జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలు చర్చలోకి వచ్చాయి