హైదరాబాద్ లోని గచ్చిబౌలి వద్ద వేగంగా వెళ్తోన్న ఓ ఆర్టీసీ బస్సు కింద 40 ఏళ్ల వ్యక్తి పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జూలై 23న కొండాపూర్ క్రాస్‌రోడ్‌లో చోటుచేసుకుంది. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై ఇంకా కారణాలు వెల్లడి కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు కింద పడి ఆత్యహత్యకు పాల్పడిన వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిసు రజబ్‌గా పోలీసులు గుర్తించారు, అతను ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్టు సమాచారం. సాయంత్రం సమయంలో కొండాపూర్ క్రాస్‌రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు రాగానే ఎదురుగా వెళ్లి టైరు కింద పడ్డాడు. అప్పుడే పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి.. అతన్ని బయటకు లాగి, ఆ తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్ చేశారు. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దని సందేశమిచ్చారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో రెండు రోజుల క్రితం జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం. ఆత్మహత్య చేసుకున్నంతా మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవు. కష్టాలు, సమస్యలను బతికుండి దైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకానీ క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దు అంటూ సజ్జనార్ ట్వీట్ లో రాసుకొచ్చారు.
హైదరాబాద్ లోని కొండాపూర్ లో రెండు రోజుల క్రితం జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం. ఆత్మహత్య చేసుకున్నంతా మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవు. కష్టాలు,… pic.twitter.com/9wxKn7sqpg
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 24, 2023