
తెలంగాణలో ఎండలు అపుడే దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచే బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాసేపు ఉంటే చాలు మాడు పగుల్తదేమోనని అనిపిస్తోంది. అయితే హాట్ హాట్ సమ్మర్ లో చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజులు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తెలిపింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. మార్చి 21 నుంచి తెలంగాణలో వర్షాలు పడతాయని.. 22 న ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. మార్చి 22న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం మరియు సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
ALSO READ | Good Health: రోజూ బీన్స్ తినండి..షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోండి..!
దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న క్రింది స్థాయి గాలులు, ద్రోణిి కారణంగా వచ్చే మూడు రోజులపాటు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయని తెలిపింది వాతావరణ శాఖ