హైదరాబాద్లో సేఫెస్ట్, కన్వీనెంట్ ప్రయాణానికి ఏదీ బెటర్..Chat GPT ఏం చెబుతుందంటే..

హైదరాబాద్లో సేఫెస్ట్, కన్వీనెంట్ ప్రయాణానికి ఏదీ బెటర్..Chat GPT ఏం చెబుతుందంటే..

హైదరాబాద్ మహానగరం ఎప్పుడూ బిజీబిజీగా రద్దీగా ఉండే సిటీల్లో ఒకటి.. ఇక్కడ రోజుకు లక్షల్లో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, స్కూళ్లు కాలేజీల విద్యార్థులు, వ్యాపారాలు చేసుకునేవారు, సిటీనుంచి చూసేందుకు ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు. ఇలా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే హైదరాబాద్లో సేఫెస్ట్, కన్వీనెంట్ ప్రయాణానికి ఏదీ బెటర్..బస్సులా..? క్యాబ్ లా..? ఆటోలా..? లేక ఎంఎంటీఎస్ రైళ్లా..? లేక హైదరాబాద్ మెట్రోనా.. అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే.. 

హైదరాబాద్ మహానగరంలో ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించేందుకు  ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, క్యాబ్ లు, మెట్రో ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదీ సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇటీవల అందుబాటులో వచ్చిన Chat GPT మాత్రం.. హైదరాబాద్ నగరంలో అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా ఏదీ అని అడిగినప్పుడు ఆసక్తికర విషయాలను చెబుతోంది. అదే ఎల్ అండ్ టీ, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి చాలా సురక్షితం అని చూపెడుతోంది.   

ALSO READ | రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు

‘‘హైదరాబాద్ లో అంత్యంత సౌకర్యవంతమైన, సురక్షఇతమైన రవాణావిధానం అటే.. అది హైదరాబాద్ మెట్రో.. వేగవంతమైనది, నమ్మదగినది, పర్యావరణానికి అనుకూలమైనది.. ఇది మీ రోజువారీ ప్రయాణానికి తగినది అని ’’ఎల్ అండ్ టీ హైదరాబాద్  మెట్రో రైల్ ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ఈరోజే స్మార్ట్ మూవ్ చేయండి..అతుకులు లేని ప్రయాణం కోసం మాతో కలిసి ప్రయాణించండి..హైదరాబాద్ లో సేఫెస్ట్, కంఫర్టబుల్ ప్రయాణం ఏదీ అంటే ఓన్లీ ఒన్.. హైదరాబాద్ మెట్రో అని చెబుతూనే కింద ఓ హెచ్చరిక కూడా ఇచ్చింది. ఇది మేం గానీ మా సిబ్బందిగా చెబుతున్న విషయం కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Chat GPT లో అడగండి ’’..ఇదే  చెబుతోందని రాశారు. 

జంట నగరంలో అత్యంత వేగవంతమైన రవాణా మార్గంగా హైదరాబాద్ మెట్రో ఒకటి. ప్రస్తుతం మూడు రూట్‌లు ఉన్నాయి. ఒకటి ఎల్‌బి నగర్ నుండి మియాపూర్ వరకు, రెండవది నాగోల్ నుండి రాయదుర్గం వరకు మరియు మూడవది పరేడ్ గ్రౌండ్స్ నుండి ఎంజి బస్ స్టేషన్ వరకు మెట్రోసేవలు అందుబాటులో ఉన్నాయి. 

ఏ మార్గంలోనైనా సౌకర్యవంతమైన ప్రయాణం. స్టేషన్లు బాగా నిర్వహించబడుతున్నాయి. పీక్ అవర్స్‌లో క్యూలను నివారించేందుకు, ప్రతి ప్రయాణంపై 10శాలం  తగ్గింపును అందించే మెట్రో కార్డ్‌ని తీసుకోవచ్చు.మెట్రో రైళ్లు టైం నడుస్తున్నాయి. ఎటువంటి ట్రాఫిక్ లేనిది. ప్రతి మెట్రో స్టేషన్‌లో స్టేషన్‌కు ఇరువైపులా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు , మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల కోసం ప్రత్యేక సీట్లు అందించబడ్డాయి ఒక బోగీ మహిళలకు రిజర్వ్ చేయడం ద్వారా అత్యంత సౌకర్యంవంతంగా సేఫ్ గా ప్రయాణించేందుకు ఎల్ అండ్ టీ ఏర్పాట్లు చేసింది.