
నగరంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలెర్ట్(6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ. వాన కురిసే చాన్స్)జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకాల వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. అత్యవసరమైతే జీహెచ్ఎంసీకి కాల్ సెంటర్ 040 21111111 కు కాల్చేయాలని ప్రజలను కోరారు.
నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించడానికి ఇదే సరైన సమయమని, ఆ ప్రాంతాల్లో రెయిన్ వాటర్ హర్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోసం గురువారం 135 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో చెట్లు విరిగి పడ్డాయని 28, వాటర్ స్టాగ్నేషన్ అయినట్లు 48, డ్రెయిన్లు జామ్ అయ్యాయని 59 ఫిర్యాదులు వచ్చాయి. వికారాబాద్ కలెక్టరేట్ లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.