
హైదరాబాద్‌సిటీ, వెలుగు: చాంద్రాయణగుట్టలో ఈ నెల20న కిడ్నాప్ కు గురైన ఐదేండ్ల బాలిక దొరికింది. నిందితులను అరెస్ట్‌చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్టు సౌత్ఈస్ట్జోన్డీసీపీ పాటిల్కాంతిలాల్సుభాష్తెలిపారు. బాలికను కిడ్నాప్‌చేసి మరొకరికి అమ్మితే.. వారు ఇంకో రేటుకు ఇంకొకరికి.. వారు మరింత రేటు పెంచి పిల్లలు కావాల్సిన వాళ్లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. చింతల్‌కు చెందిన జావేద్‌పాషా బంజారాహిల్స్‌లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ లో పని చేస్తుండగా, పర్వీన్చిలుకానగర్లో ఫస్ట్ఎయిడ్క్లినిక్రన్చేస్తోంది. వీరికి చాంద్రాయణగుట్ట పీఎస్పరిధి గాంధీ విగ్రహం సమీపంలోని భ్రమరాంబ వైన్స్ సమీపంలో ఏప్రిల్ 20న మరియంసాది(5) అనే పాప కనిపించింది.
వెంటనే వెహికల్నంబర్ప్లేట్మార్చి ప్లాన్ప్రకారం పాపను ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా జావేద్ పాషా, షాయిస్తా పర్వీన్‌ను గుర్తించారు. విచారించగా, బాలికను ఉప్పల్‌లోని పర్వీన్ భానుకు రూ.1.30 లక్షలకు అమ్మినట్టు చెప్పారు. పర్వీన్ భాను బాలికను ఉప్పల్‌కు చెందిన సునీత కుమారి, రాజేంద్రప్రసాద్‌కు రూ. 2 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అందరినీ అరెస్ట్ చేశారు.
రాజేంద్ర ప్రసాద్, సునీత కుమారి గతంలో ముంబైలోని విక్రోలి పోలీస్ స్టేషన్‌లో బాలల అక్రమ రవాణా కేసులో నిందితులు. సయ్యద్ జావేద్ పాషా, షాయిస్తా పర్వీన్, పర్వీన్ భాను, సునీత కుమారి, రాజేంద్రప్రసాద్ పిల్లలను కొని అమ్ముతున్నట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి పోలీసులు యాక్టివా బైక్, ఆటో, ఆల్టో కారు, ఐదు మొబైల్ ఫోన్‌లు, రూ.76 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మనోజ్ కుమార్, ఎస్‌హెచ్‌ఓ కె. గురునాథ్ ఈ కేసు దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు.