హైదరాబాద్​లో భారీ వర్షం... జీహెచ్​ఎంసీ హెచ్చరికలు జారీ

హైదరాబాద్​లో భారీ వర్షం... జీహెచ్​ఎంసీ హెచ్చరికలు జారీ

భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. నగరంలోని కూకట్‌పల్లి, ముసాపేట్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్‌లో ( వార్త రాసే సమయానికి) భారీ వర్షం పడుతోంది.

 హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిపింది. మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్ పల్లి, అల్విన్ కాలనీ ఏరియాల్లో వర్షం పడుతోంది. . గత వారం రోజుల నుంచి అప్పుడప్పుడు వరుణుడు అలా పలకరించి వెళ్తున్నాడు. దాంతో నగరంలో రాత్రివేళ చలి పెరుగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, చింతల్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్ సికింద్రాబాద్, నాంపల్లి, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కొత్త పేట, మలక్ పేట, మాదన్న పేట, సైదాబాద్, ఐఎస్ సదన్, చాదర్ ఘాట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, తుర్కయంజాల్, హయత్ నగర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారాం, తార్నాక, ఘట్ కేసర్ తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే ఈ రోజు ( జైన్​ 30) రాత్రికి నగరానికి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా మేయర్ సూచించారు. అనవసరంగా ఎవ్వరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని GHMC హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.