రెయిన్​ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లతో మేలు

రెయిన్​ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లతో మేలు

రెయిన్​ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లతో గురువారం కాస్త మేలు జరిగింది. వర్షం కురిసిన 20 నిమిషాల్లోనే హోల్డింగ్ స్ట్రక్చర్లు నిండాయి. ఆ తర్వాత వరద రోడ్డుపై నిలిచింది. 3 గంటల వ్యవధిలో దాదాపు 9 సెంటీమీటర్లకుపైగా వాన పడటంతో వెంటనే హోల్డింగ్ స్ట్రక్చర్లు నిండాయని అధికారులు చెప్పారు. రాజ్ భవన్ సమీపంలోని 10 లక్షల లీటర్ల వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ కేవలం 20 నిమిషాల్లో నిండిందన్నారు. ఇవి లేకపోతే భారీగా వరద నీరు రోడ్లపై నిలిచేది.