బీసీసీఐ సీనియర్ విమెన్స్‌‌ వన్డే టోర్నమెంట్‌‌.. ముంబైపై హైదరాబాద్ గెలుపు

బీసీసీఐ సీనియర్ విమెన్స్‌‌ వన్డే టోర్నమెంట్‌‌.. ముంబైపై  హైదరాబాద్ గెలుపు

హైదరాబాద్‌‌, వెలుగు: బీసీసీఐ సీనియర్ విమెన్స్‌‌ వన్డే టోర్నమెంట్‌‌లో హైదరాబాద్ సత్తా చాటింది.  అహ్మదాబాద్‌‌లో మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌‌లో హైదరాబాద్ అమ్మాయిలు 14 రన్స్ తేడాతో బలమైన ముంబైపై విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్‌‌కు వచ్చిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 243/6 స్కోరు చేసింది. 

మమత (86 నాటౌట్‌‌) టాప్ స్కోరర్‌‌‌‌గా నిలవగా.. అనురాధ నాయక్ (42) రాణించింది. అనంతరం ఛేజింగ్‌‌లో ముంబై 48.2 ఓవర్లలో 229 రన్స్‌‌కే ఆలౌటైంది. వృశాలి (82), ఖుషి (52 నాటౌట్‌‌) పోరాడారు. హైదరాబాద్ బౌలర్లలో యశశ్రీ, సాక్షి రావు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.