బెట్టింగ్ యాప్స్‌‌ దర్యాప్తు కోసం ప్రత్యేక ఎస్‌‌వోపీ

బెట్టింగ్ యాప్స్‌‌ దర్యాప్తు కోసం  ప్రత్యేక ఎస్‌‌వోపీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఆన్‌‌లైన్ బెట్టింగ్ యాప్‌‌ల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన  సిట్‌‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన బెట్టింగ్‌‌ కేసుల దర్యాప్తుకు అవసరమైన స్టాండర్డ్‌‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌‌‌‌(ఎస్‌‌ఓపీ)ని తయారు చేస్తోంది.

 ఈ మేరకు సీఐడీ చీఫ్‌‌ శిఖాగోయల్ నేతృత్వంలో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఐజీ రమేశ్ రెడ్డి సహా సిట్‌‌ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ప్రధానంగా  బెట్టింగ్ యాప్స్‌‌ కేసులను సులువుగా ఛేదించేందుకు సిట్‌‌ కేంద్రంగా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్‌‌ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు.