10 కేజీల గంజాయి సీజ్

10 కేజీల గంజాయి సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బస్సులో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశాకు చెందిన ఉత్తమ్‌‌‌‌ మండల్‌‌‌‌ అదే ప్రాంతానికి చెందిన ఉపేందర్‌‌‌‌ మండల్‌‌‌‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి సిటీకి తీసుకొచ్చి అమ్ముతున్నాడు. పక్కా సమాచారంతో గౌళిగూడ సెంట్రల్‌‌‌‌ బస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ సమీపంలో శుక్రవారం ఉత్తమ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి, సెల్‌‌‌‌ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉపేందర్‌‌‌‌ మండల్‌‌‌‌ పరారీలో ఉన్నట్లు ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు తెలిపారు.

గేమింగ్ డెన్ పై దాడి.. 19మంది అరెస్ట్

సంతోష్ నగర్ పీఎస్‌‌‌‌ పరిధిలోని గేమింగ్ డెన్ పై  సిటీ సౌత్,ఈస్ట్ టాస్క్ ఫోర్స్-టీమ్ గురువారం అర్ధరాత్రి దాడి చేసింది. నిర్వాహకుడితోపాటు మరో18 మందిని అరెస్ట్ చేశారు.  వారి  నుంచి రూ.29 వేలు, 108 ప్లేయింగ్ కార్డ్స్, ఒక సీల్డ్ కార్డ్స్ బాక్స్, 16 సెల్​ఫోన్లను సీజ్ చేశారు. తదుపరి విచారణ  కోసం నిందితులను, సీజ్ చేసిన సామాగ్రిని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.