
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్టలో ఆలయ భూముల రక్షణకు హైడ్రా, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఆలయ భూములను కొందరు వ్యక్తులు పలు సంఘాల పేరుతో కబ్జా చేశారు. అది సరిపోదనట్లు ఆలయ గుండాన్ని కూడా కబ్జా చేయడంతో ఆలయ పూజారి ఓ వీడియోలో కన్నీరుపెట్టున్నాడు.
దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని రోజుల క్రితం ఆలయ భూములను పరిశీలించారు. ఇందులో భాగంగా హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సోమవారం 10 సంఘాలకు నోటీసులు అందజేశారు. ఈ నెల 24లోపు కబ్జాలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పత్రాలు అందజేయాలని నోటీసుల్లో కోరారు. వాటిని పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.