AP News: చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

AP News: చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

రైల్వేకోడూరు:  సీఎం చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు అవసరమని చాలా సభల్లో చెప్పానన్న .. పవన్​ కళ్యాణ్​...  అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబేనన్నారు.  లక్షలమందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారు. నాకంటే బాగా ఆలోచించ గలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది. 

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. గ్రామాలకు ఏం కావాలనేదానిపై చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే లక్ష్యమన్నారు. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట నిర్వహించిన గ్రామ సభలో ఆంధ్రప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి  పవన్‌ పాల్గొని మాట్లాడారు. 

గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిందంటూ....  గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో.. గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. .గత ప్రభుత్వం  నిధులను  దారి మళ్లించిందన్నారు.  ఇంకా  గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీని బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. 13వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలుగుతామన్నారు.  బాధ్యతల నుంచి మేం పారిపోం.. నిరంతరం పనిచేస్తాం. అద్భుతాలు చేయడానికి మా  చేతిలో మంత్రదండం లేదు.. గుండెల నిండా నిబద్ధత ఉంది.

పదవి నాకు అలంకారం కాదు.. బాధ్యత అని అన్నారు.   ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధమంటూ....  వారికి కష్టమొస్తే అండగా ఉంటానన్నారు.   ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని... . అవసరమైతే గూండా యాక్ట్‌ తెస్తామని ఉపముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ అన్నారు.   ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే వ్యర్థమే.  ప్రస్తుతం  గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని పరిస్థితి ఉంది. దాతలు ముందుకొస్తే నేను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానన్నారు. రాయలసీమ నుంచి వలసలు నివారిస్తామంటూ... ఉపాధి అవకాశాలు పెంచుతాం. వలసలను అరికట్టేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ తీసుకొస్తామని పవన్‌కల్యాణ్‌ అన్నారు. మైసూరువారిపల్లె పంచాయతీకి 10 సెంట్ల స్థలం అందించిన రైతు కారుమంచి నారాయణను  డిప్యూటీ సీఎం  పవన్​ కళ్యాణ్​  అభినందించారు.