అన్ని మీడియా ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక..రక్షణ,భద్రతదళాల కార్యకలాపాల లైవ్ ప్రసారం చేయొద్దు

అన్ని మీడియా ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక..రక్షణ,భద్రతదళాల కార్యకలాపాల లైవ్ ప్రసారం చేయొద్దు

అన్ని మీడియా ఛానెళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ,మ భద్రతా దళాల  కదిలికలకు సంబంధించిన ఎటువంటి లైవ్ ప్రసారం చేయకూడదని తెలిపింది. వార్తా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫాంలు, టీవీ నెట్ వర్క్ లు, సోషల్ మీడియా వినియోగదారులు అందరికి ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. 

రక్షణ, భద్రతా దళాల సమాచారం బహిర్గతం అయితే ప్రత్యర్థులకు సాయపడుతుంది.. భద్రతా సిబ్బందికి హాని కలిగేఅవకాశం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్గిల్ యుద్ధం, 26/11, కాందహార్ హైజాక్ వంటి గత సంఘటనలు ప్రసారం చేయడం ద్వారా చాలా నష్టం జరిగింది. కాబట్టి అన్ని మీడియా ఛానెళ్లు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు పాటించాలని కోరింది. 

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల (సవరణ) రూల్స్, 2021లోని రూల్ 6(1)(పి)కి కట్టుబడి ఉండాలని సమాచార ,ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని టీవీ ఛానెళ్లకు సూచనలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించింది. 

►ALSO READ | Pahalgam Attack:రక్షణ మంత్రితో.. ఆర్మీ చీఫ్ భేటీ : యుద్ధానికి డేట్, టైం ఫిక్స్ అయ్యిందా..?

జాతీయ భద్రత దృష్ట్యా భద్రతా బలగాలు చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ,కదలికలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని, ఆపరేషన్ ముగిసే వరకు మీడియా కవరేజీని ప్రభుత్వంచే నియమించబడిన అధికారి ఇచ్చిన సమాచారం మాత్రమే ప్రసారం చేయాలని కోరింది.