నేటి(అక్టోబర్ 05 ) నుంచే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ .. ఇంగ్లండ్‌–న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ మధ్య తొలి మ్యాచ్​

నేటి(అక్టోబర్ 05 )   నుంచే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌  ..  ఇంగ్లండ్‌–న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ మధ్య తొలి మ్యాచ్​
  • బరిలో 10 జట్లు 
  • ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా టీమిండియా 
  • నేడు అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌-న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ మధ్య తొలి మ్యాచ్​
  • మ. 2 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, డీడీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ లైవ్​

క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఎన్ని టోర్నీలు ఉన్నా  వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ వచ్చిందంటే ఆ కిక్కే వేరు.!  
ఎన్ని టోర్నీలు గెలిచినా.. ఈ కప్పు గెలిస్తే వచ్చే మజానే వేరు..!  
వేరే ఎక్కడ ఆడినా...ఆడకపోయినా  వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అదరగొడితే.. 
ఎదురైన ప్రత్యర్థిని పడగొడుతూ ముందుకెళ్తుంటే  కలిగే ఆనందమే వేరు..!  

వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లోని  అసలు సిసలు మజాను అందించే వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ పుష్కరకాలం తర్వాత ఇండియా గడ్డపై మరోసారి సందడి చేయనుంది..! అభిమానులను అలరించేందుకు పది టీమ్స్‌‌‌‌‌‌‌‌.. సూపర్‌‌‌‌‌‌‌‌స్టార్స్‌‌‌‌‌‌‌‌.. యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ రెడీ అయ్యారు..!  ఇక నెలన్నరపాటు అందరం  క్రికెట్‌‌‌‌‌‌‌‌  వరల్డ్‌‌‌‌‌‌‌‌లో విహరిద్దామా?

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌: నాలుగేండ్లకోసారి జరిగే క్రికెట్‌‌‌‌‌‌‌‌ కార్నివాల్‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌.. ఈ ఆటను ఎంతగానో  ఆరాధించే ఇండియా గడ్డపైకి 12 ఏండ్ల తర్వాత తిరిగొచ్చింది. ఈ టోర్నీ 13వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోని వరల్డ్‌‌‌‌‌‌‌‌ బిగ్గెస్ట్ స్టేడియంలో గురువారం మొదలవనుంది. ఆతిథ్య టీమిండియా సహా బరిలో నిలిచిన పది జట్లు 48 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యాయి. 

గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌ ఫైనలిస్టులు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ మధ్య తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో ఈ మెగా క్రికెట్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌కు తెరలేవనుంది. టీమిండియా ఈ నెల 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తన పోరు ఆరంభించనుంది. 14న నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఇండియా–పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో మెగా టోర్నీకి మరింత ఊపు రానుంది. మొత్తం పది వేదికల్లో.. 46 రోజుల పాటు పోటీ జరగనుంది. 

గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌నే ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. లీగ్‌‌‌‌‌‌‌‌ దశలో ప్రతి జట్టు మిగతా తొమ్మిది టీమ్స్‌‌‌‌‌‌‌‌తో ఒక్కోసారి పోటీ పడుతుంది. టాప్‌‌‌‌‌‌‌‌4లో నిలిచిన జట్లు సెమీస్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లోనే జరిగే ఫైనల్‌‌‌‌‌‌‌‌తో మెగా ఈవెంట్ ముగుస్తుంది.

ఈసారి  ప్రత్యేకం

క్రికెట్‌‌‌‌‌‌‌‌ పుట్టిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గడ్డపై 1975లో 8 జట్లతో మొదలైన వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ గత 12 ఎడిషన్లలో అభిమానులను ఎంతో అలరించింది. ప్రతీసారి కొత్త స్టార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, టీ20ల రాకతో వన్డేలకు క్రమంగా ఆదరణ తగ్గుతుందన్న  సమయంలో 13వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌  క్రికెట్​ను ఆరాధించే ఇండియాలో జరగడం అత్యంత కీలకం, ప్రత్యేకం కానుంది. ఇండియా గడ్డపై టోర్నీ సక్సెస్ అయితే ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ జోష్‌‌‌‌‌‌‌‌  రానుంది.  

తొలి రెండు ఎడిషన్లు గెలిచి.. ఒకప్పుడు క్రికెట్‌‌‌‌‌‌‌‌ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ ఈసారి క్వాలిఫై అవ్వకపోవడంతో టోర్నీ ఆరంభానికి ముందే సంచలనం అయింది. టీమిండియా సహజంగానే ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. పైగా ఆతిథ్య జట్టు కావడంతో భారీ అంచనాలున్నాయి.1983లో కపిల్‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌, 2011లో ధోనీ కెప్టెన్సీలో కప్పు నెగ్గిన ఇండియా ఈసారి రోహిత్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో ముచ్చటగా  మూడోసారి చాంపియన్ అవ్వాలని ఆశిస్తోంది. 

గత మూడు ఎడిషన్లలో ఆతిథ్య జట్లే (ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌) విజేతలుగా నిలిచిన నేపథ్యంలో ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగాలని ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఐదుసార్లు విన్నర్‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా ఆరో టైటిల్​పై గురి పెట్టగా... బజ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఆటతో ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చిన  డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మరో టైటిల్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తోంది. ప్రతీ టోర్నీలో నిలకడగా ఆడుతూ.. గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో  బౌండరీ కౌంట్‌‌‌‌‌‌‌‌తో కప్పును చేజార్చుకున్న న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఈసారి ఎలాగైనా వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అవ్వాలని కసిగా ఉంది. 

కాస్త ఊపు తగ్గినా మాజీ చాంపియన్లు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, శ్రీలంకను  తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రతీసారి ఎన్నో ఆశలతో పాటు  దురదృష్టాన్ని మోసుకొచ్చే  సౌతాఫ్రికా తొలి కప్పు కోసం మరో ప్రయత్నం చేస్తోంది. కప్పు నెగ్గే సత్తా లేకపోయినా.. ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసేందుకు ఆసియా జట్లు బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ ముందుంటాయి. ఇక, క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ టోర్నీలోనే వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ పని పట్టిన  కొత్త జట్టు నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో కూడా అలాంటి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వాలని కోరుకుంటోంది. ఏ జట్టు ఎలా ఆడినా మెగా టోర్నీలో ప్రతీ రోజు.. ప్రతీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌.. ప్రతీ బంతిని ఆస్వాదించాలని సగటు క్రికెట్‌‌‌‌‌‌‌‌ అభిమాని ఆశిస్తున్నాడు.

 

  1. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన క్రికెటర్‌‌‌‌‌‌‌‌ సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌. ఆరు ఎడిషన్లలో అతను 45 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లాడి 2278 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

  2. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు కొట్టిన ప్లేయర్లు క్రిస్‌‌‌‌‌‌‌‌ గేల్‌‌‌‌‌‌‌‌, మార్టిన్‌‌‌‌‌‌‌‌ గప్టిల్‌‌‌‌‌‌‌‌. ఈ ఇద్దరూ 2015 ఎడిషన్‌‌‌‌‌‌‌‌ లోనే ఈ ఘనత సాధించారు.

  3. వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌నకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. ఇది వరకు 1987లో పాక్‌‌‌‌‌‌‌‌తో కలిసి, 1996లో పాక్‌‌‌‌‌‌‌‌, లంకతో కలిసి, 2011లో లంక, బంగ్లాతో కలిసి నిర్వహించింది. 

  4. సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌, జావెద్ మియాందాద్‌‌‌‌‌‌‌‌ అత్యధికంగా ఆరు వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో ఆడారు. సచిన్‌‌‌‌‌‌‌‌  1992 నుంచి 2011 వరకు ఆడగా.. మియాందాద్‌‌‌‌‌‌‌‌ 1975 నుంచి 1986 వరకు బరిలో నిలిచాడు.

  5. సచిన్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్స్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా ఆరు సెంచరీలు కొట్టారు.