మనోళ్లే ఆరుగురు: 2023 మెన్స్ వన్డే జట్టును ప్రకటించిన ఐసీసీ

మనోళ్లే ఆరుగురు: 2023 మెన్స్ వన్డే జట్టును ప్రకటించిన ఐసీసీ

2023 వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఐసీసీ ఒక జట్టుగా ప్రకటించింది. ఈ ప్లేయింగ్ 11 లో టీమిండియా నుంచి రోహిత్ శర్మ, శుభమాన్ గిల్,విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలకు చోటు దక్కింది. దక్షిణాఫ్రికా నుంచి క్లాసన్, మార్కో జాన్సెన్.. ఆస్ట్రేలియా నుంచి ఓపెనర్ ట్రావిస్ హెడ్, స్పిన్నర్ ఆడమ్ జంపా.. న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్ ఈ అరుదైన జాబితాలో చోటు సంపాదించుకున్నారు.    
     
రోహిత్ శర్మ ఈ జట్టుకు కెప్టెన్ గా ప్రకటించారు. 2023 సంవత్సరంలో రోహిత్ బ్యాటింగ్ తో పాటు, కెప్టెన్ గా సత్తా చాటాడు. 52 యావరేజ్ తో 1255 పరుగులు సాధించాడు. గిల్  ఒక డబుల్ సెంచరీతో పాటు మొత్తం 1584 పరుగులు చేసాడు. నెంబర్ త్రీలో ఆసీస్ ఆటగాడు హెడ్ కు అవకాశం కల్పించింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఆసీస్ ఓపెనర్ 137 పరుగులు చేసి ఆసీస్ కు వరల్డ్ కప్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో మిచెల్, ఆరో స్థానంలో క్లాసన్, ఏడో స్థానంలో మార్కో జాన్సెన్ లను ఎంపిక చేశారు. 

2023 లో కోహ్లీ ఆరు సెంచరీలతో 1377 పరుగులు చేయగా.. కివీస్ ఆటగాడు మిచెల్ 1204 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసన్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. ఏకైక ఆల్ రౌండర్ గా మార్కో జాన్సెన్ బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటాడు. 8 వ స్థానంలో జంపా, 9,10,11 స్థానాల్లో వరుసగా భారత ప్లేయర్లు కుల్దీప్ యాదవ్, సిరాజ్, మహమ్మద్ షమీలు ఉన్నారు.