టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ బౌలర్ అవతారం ఎత్తాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచులో కోహ్ల బౌలింగ్ వేశాడు. ప్రస్తుతం కోహ్లీ బౌలింగ్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హార్దిక్ పాండ్యా గాయపడటంతో కోహ్లీ బౌలింగ్కు వచ్చాడు. హార్దిక్ మూడు బంతులు వేసిన తర్వాత అతని కాలికి గాయమైంది. దీంతో ఆ ఓవర్ను కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతులు వేశాడు. ఈ మూడు బంతుల్లో ఒక బంతిని డాట్ చేయగా..మిగతా రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చాడు.
Starc Who ??#ViratKohli? #INDvsBAN #WC2023 #RohitSharma? pic.twitter.com/54xnzdfIe4
— Tanay (@tanay_chawda1) October 19, 2023
కోహ్లీ ఆరేళ్ల తర్వాత వన్డేల్లో బౌలింగ్ వేశాడు. చివరగా అతను 2015లో ఆస్ట్రేలియాపై బౌలింగ్ చేశాడు. కోహ్లీ వన్డే కెరీర్ ను పరిశీలిస్తే..ఇప్పటి వరకు 49 ఇన్నింగ్స్ లలో 107 ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.